నవదుర్గలలో ఆరవ అవతారం శ్రీ కాత్యాయనీ దేవి.
పురాణాల ప్రకారం కాత్యాయన మహర్షి తపస్సుకు ప్రసన్నమైన ఆదిపరాశక్తి ఆయన కుమార్తెగా అవతరించడంతో అమ్మవారికి కాత్యాయనీ అనే పేరు వచ్చింది.
శ్రీ కాత్యాయనీ దేవి ధైర్యానికి, శక్తికి, ధర్మరక్షణకు ప్రతీక. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి స్వరూపంగా అమ్మవారిని ఆరాధిస్తారు.
నవరాత్రులలో ఆరవ రోజున శ్రీ కాత్యాయనీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అమ్మవారి ఆరాధన వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
శ్రీ కాత్యాయనీ దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం.
