నవదుర్గలలో ఏడవ అవతారం శ్రీ కాళరాత్రి దేవి.
పురాణ విశ్వాసాల ప్రకారం శ్రీ కాళరాత్రి దేవి దుష్టశక్తులను నాశనం చేసి, ధర్మాన్ని రక్షించే మహాశక్తి స్వరూపిణి.
అమ్మవారు నల్లని వర్ణంతో, నాలుగు భుజాలతో, గాడిద వాహనంపై దర్శనమిస్తారు. భయంకరమైన రూపంలో కనిపించినప్పటికీ భక్తులకు శుభాలను ప్రసాదించే తల్లిగా ఆరాధించబడతారు. అందుకే అమ్మవారిని శుభంకరి అని కూడా పిలుస్తారు.
నవరాత్రులలో ఏడవ రోజున శ్రీ కాళరాత్రి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అమ్మవారి ఆరాధన వల్ల భయం తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
శ్రీ కాళరాత్రి దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం.
